అతి తక్కువ సమయంలో కరోనా వ్యాక్సిన్ తయారు చేశారని... మంచి ఫలితాలు ఇస్తోందని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నారు. అపోహలు వీడి... అందరూ టీకా తీసుకోవాలని సూచించారు. శుక్రవారం నాడు హైదరాబాద్లోని కాచిగూడ ప్రతిమ ఆస్పత్రిలో ఆయన సతీమణి వినోదతో కలిసి వ్యాక్సిన్ తీసుకున్నారు.
అపోహలు వీడి వ్యాక్సిన్ తీసుకోండి: మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు - తెలంగాణ వార్తలు
అపోహలు వీడి కరోనా టీకా అందరూ తీసుకోవాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు సూచించారు. కరోనాను నియంత్రించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు అద్భుతమని కొనియాడారు. కాచిగూడలోని ప్రతిమ ఆస్పత్రిలో ఆయన టీకా తీసుకున్నారు.
అపోహలు వీడి వ్యాక్సిన్ తీసుకోండి: మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు
కరోనా మహమ్మారి ఉన్నా లేకున్నా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. కరోనాను నియంత్రించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు అద్భుతమని కొనియాడారు. వ్యాక్సిన్ తీసుకున్నాక ఎలాంటి దుష్ప్రభావాలు లేవని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:'చమురుపై పన్ను తగ్గింపు బాధ్యత ఒక్క కేంద్రానిదే కాదు'
TAGGED:
hyderabad district news