లాక్‌డౌన్ నేపథ్యంలో పేదల పరిస్థితి దారుణంగా ఉంది... ఒక్క పూట తిండి కోసం వారు నానా తంటాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో మహంకాళి పోలీసులు అన్నార్తుల ఆకలి తీరుస్తున్నారు. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న 50 మంది పేదలు, యాచకులకు ఆహారం పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని పోలీసులకు సహకరించాలని కోరారు.
అన్నార్తుల ఆకలి తీరుస్తున్న మహంకాళి పోలీసులు - mahankali police distributed food to poor people
మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న యాచకులు, నిరుపేదలకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు మహంకాళి పోలీసులు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఓ వైపు విధులు నిర్వర్తిస్తూ.. మరోవైపు అన్నార్తుల ఆకలి తీరుస్తూ ఔదార్యం చాటుతున్నారు.
![అన్నార్తుల ఆకలి తీరుస్తున్న మహంకాళి పోలీసులు mahankali-police-distributed-food-to-poor-people-at-mahankali-police-station-region](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6906662-thumbnail-3x2-hyd.jpg)
అన్నార్తుల ఆకలి తీరుస్తున్న మహంకాళి పోలీసులు