ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర పురస్కరించుకుని ఉదయం నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు సికింద్రాబాద్‌కి ఆలయం వద్దకు తరలివచ్చారు. ఈనెల 21న బోనాల పండుగకు ముందు వచ్చే శుక్రవారాన్ని మినీ జాతరగా పురస్కరించుకొని మహిళలు బోనాలతో తమ మొక్కులు చెల్లించుకున్నారు. పోతరాజుల విన్యాసాలు, అమ్మవారి ఘటాల ఊరేగింపుతో ఆలయం వద్ద పండుగ శోభ సంతరించుకుంది. జాతరలో ఎటువంటి అవాంతరాలు జరగకుండా పోలీసులు పటిష్ఠమైన చర్యలు చేపట్టారు. పోలీస్‌స్టేషన్ ఆవరణలో వైద్య శిబిరాన్ని సైతం ఏర్పాటు చేశారు.
మహంకాళి జాతరకు పోటెత్తిన భక్తులు - mahankali-jatara
ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల ఆరంభానికి ముందుశుక్రవారం అయినందున ఇవాళ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చారు.
మహంకాళి జాతరకు పోటెత్తిన భక్తులు