హైదరాబాద్ నగర శివారు గండిపేట్ మండలంలోని నార్సింగిలో బోనాల జాతర అట్టహాసంగా ముగిసింది. మహిళలు ఊరేగింపుగా వెళ్లి బోనాలు అమ్మవారికి సమర్పించారు. తాత ముత్తాతల నుంచి ఈ జాతర ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని గ్రామ సర్పంచ్ వెంకటేష్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు కురవాలని ఎల్లమ్మ తల్లి పోచమ్మను ప్రార్థిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రతి బోనాల పండుగకి ఇంటి ఆడపడుచులను ఆహ్వానించి వారికి కొత్త బట్టలు బహుమతిగా ఇస్తున్నామని తెలిపారు.
గండిపేటలో బోనాల జాతర - గండిపేట
ఆషాడ మాసం గ్రామ గ్రామాన, పట్టణాల్లో తెలంగాణ బోనాల సందడి ఊపందుకుంది. పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లు, యువకుల తీన్మార్ నృత్యాలు ఆకట్టుకుంటున్నాయి.
గండిపేటలో బోనాల జాతర