రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ అన్నదమ్ముల్లా కలిసి ఉండాల్సిన అవసరం ఉందని హోం మంత్రి మహమ్మద్ అలీ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇచ్చిన స్టార్ విందుకు ఎమ్మెల్సీలు ఫరీదుద్దీన్, భూపాల్ రెడ్డిలతో కలిసి మహమూద్ అలీ హాజరయ్యారు. ఏపీకి గత ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు... నీరు, అభివృద్ధి విషయాల్లో ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండేది కాదన్నారు. ప్రస్తుతం ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయినందున రెండు రాష్ట్రాలు అన్నాదమ్ములలా కలిసి అభివృద్ధి పథంలో దూసుకెళ్లే అవకాశం ఉందని మహమూద్ అలీ తెలిపారు.
'తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసుండాలి' - IFTHER
"పక్క పక్కనే ఉంటున్నాం. అన్నాదమ్ముల్లా కలిసుంటే ఇరు రాష్ట్రాలను మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది": మహమూద్ అలీ, హోం మంత్రి
'తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ములా కలిసుండాలి'