Srimalahanikareswara Swamy Temple: కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరిలో గల శ్రీ మలహానికరేశ్వర స్వామివారి ఆలయంలో మహాకుంభాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో నూతనంగా మహా రాజగోపురాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా.. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ క్రతువులో మొదట శ్రీ స్తంభ గణపతి ఆలయంలో కుంభాభిషేక వేడుకను నిర్వహించారు. అనంతరం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు శ్రీ మలహానికరేశ్వరస్వామి ఆలయంలో వేద, మంత్రోచ్ఛరణల మధ్య సహస్ర కలశాభిషేకాన్ని శాస్త్రోక్తంగా చేపట్టారు. కన్నుల పండువగా నిర్వహించిన ఈ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో సాగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని దేవతామూర్తులను దర్శించుకున్నారు.
ఉదయం తొమ్మిది గంటల తరువాత శ్రీ మలహానికరేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీమలహానికరేశ్వరస్వామికి, శ్రీభవానీ అమ్మవారికి కూడా మహా కుంభాభిషేకం నిర్వహించారు. ఆలయంలోని విమానగోపురానికి, రాజగోపురాలకు కూడా కుంభాభిషేకం నిర్వహించారు. ఇది ముగిసిన అనంతరం మహాపూజ, మహా నీరాజనం వంటి పూజా కార్యక్రమాలను నిర్వహించంచారు. భారతీ తీర్థ మహా స్వామి, విధుశేఖర భారతీ మహాస్వామి చేతుల మీదుగా ఆలయంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవే కాకుండా పదకొండు రోజుల పాటు ప్రధాన ఆలయం ప్రాంగణంలో హోమాలను నిర్వహించనున్నారు.
ఇవీ చదవడి: