సికింద్రాబాద్ చిలకలగూడా మైదానంలోని మహాగణపతి.. అఖిషా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు అందుకుంటున్నారు. బుధవారం ఉదయం వర్గిల్ వేద బ్రాహ్మణులతో అగ్ని ప్రతిష్ఠ, మహాగణపతి హోమం, కరోనా నివారణార్థం మహా మృత్యుంజయ జపం చేశారు.
కరోనా నివారణ మృత్యుంజయ హోమం - secunderabad ganesh utsav 2020
సికింద్రాబాద్ చిలకలగూడా మైదానంలోని మహాగణపతికి బుధవారం వర్గిల్ వేద బ్రాహ్మణులతో అగ్ని ప్రతిష్ఠ, మహాగణపతి హోమం, కరోనా నివారణార్థం మహా మృత్యుంజయ జపం చేశారు. అనంతరం నిర్వాహకులు భక్తులందరికీ మాస్కులు అందజేశారు.
![కరోనా నివారణ మృత్యుంజయ హోమం maha ganapathi homam at secunderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8572186-198-8572186-1598493398344.jpg)
అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ మహా గణపతి పూజలు
అఖిషా ఫౌండేషన్ బండపల్లి సతీష్ దంపతులు.. భక్తులందరికీ మాస్కులు అందజేశారు. పూజలు, భక్తుల దర్శనం, ప్రసాద వితరణ కార్యక్రమాలన్నీ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చేస్తున్నారు. సికింద్రాబాద్లో ఈ ఏడాది ఏర్పాటై సామూహిక పూజలు అందుకుంటున్న ఏకైక గణపతి కావడం వల్ల మహాగణపతి అందరినీ ఆకర్షిస్తున్నారు.
ఇవీ చూడండి:'విశ్వవిద్యాలయాలు పూర్వ విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలి'