మీటూలో కొందరి పేర్లు ఆశ్చర్యం కలిగించాయి: మాధురి - bollywood
మీటు ఉద్యమంపై బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ స్పందించింది. శ్రీదేవి లేని లోటును ఎవరూ పూడ్చలేరంది.
బాలీవుడ్లో మీటూ ఉద్యమంపై ప్రధాన తారలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా సీనియర్ నటి మాధురి దీక్షిత్ ఈ విషయంపై స్పందిస్తూ అలోక్ నాథ్, సౌమిక్ సేన్ వంటి వారి పేర్లు ఇందులో ఉండటం ఆశ్చర్యం కలిగించిందని తెలిపింది.
మాధురితో 'గులాబ్ గ్యాంగ్' సినిమా తీసిన అలోక్ నాథ్‌పై దర్శకురాలు 'వింటా నందా' తనను లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
మనకు తెలిసిన వారికి సంబంధించి ఇటువంటి వార్తలు చదవడం ఎప్పుడూ విస్మయం కలిగిస్తుందంది మాధురి. ప్రస్తుతం ఆవిడ ఇంద్రకుమార్ దర్శకత్వంలో 'టోటల్ ధమాల్', కరణ్ జోహర్ నిర్మాణంలో 'కలంక్' సినిమాలో నటిస్తోంది. 'కలంక్' చిత్రంలోని పాత్రను శ్రీదేవి చేయాల్సిఉన్నా.. అతిలోక సుందరి మరణంతో ఆ క్యారక్టర్ మాధురికి దక్కింది. శ్రీదేవి లేరన్న వార్తను ఇంకా మరిచిపోలేక పోతున్నాననంది మాధురి.