వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్‌పై వ్యాఖ్యలు చేసినందుకు ప్రస్తుతం తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న తమిళిసై సౌందరరాజన్‌పై(tamilisai soundararajan) దాఖలైన పరువునష్టం కేసు కొట్టివేస్తూ(madras high court quashes defamation case) మద్రాస్ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులిచ్చింది. తమిళిసై 2017లో భాజపా(bjp) తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ కట్టపంచాయత్తు (దాదాగిరి) చేస్తున్నారని మీడియాలో వ్యాఖ్యానించారు. దీనిపై వీసీకే సభ్యుడు తాటి కార్తికేయన్ కాంచీపురం కోర్టులో పరువునష్టం వ్యాజ్యం(madras high court quashes defamation case) వేశారు.
tamilisai soundararajan: పరువునష్టం కేసులో గవర్నర్ తమిళిసైకి ఊరట - తెలంగాణ వార్తలు
పరువునష్టం కేసులో గవర్నర్ తమిళిసై(tamilisai soundararajan)కి ఊరట లభించింది. తమిళిసై 2017లో భాజపా తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్‌పై చేసిన వ్యాఖ్యలపై వీసీకే సభ్యుడు తాటి కార్తికేయన్ కాంచీపురం కోర్టులో పరువునష్టం వ్యాజ్యం వేశారు. దీనిని కొట్టివేస్తూ మద్రాస్ హైకోర్టు(madras high court quashes defamation case) ఉత్తర్వులిచ్చింది.
విచారణకు తమిళిసై హాజరుకావాలంటూ కోర్టు సమన్లు పంపింది. సమన్లు, కేసును రద్దు చేయాలని కోరుతూ ఆమె మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణలో భాగంగా న్యాయమూర్తి జస్టిస్ దండపాణి మాట్లాడుతూ.. రాజ్యాంగం వాక్ స్వాతంత్య్రం, వ్యక్తీకరణ స్వేచ్ఛను అందించినప్పటికీ వాటికి పరిమితులు విధించిందన్న విషయాన్ని గుర్తుచేశారు. కేసు కొట్టివేస్తున్నట్లు(madras high court quashes defamation case) ప్రకటించారు.
ఇదీ చదవండి:Huzurabad By Election: ఉపపోరుకు తెరాస, భాజపా వ్యూహాలు.. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో?