ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీ గౌడ్, ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో శుక్రవారం భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయలు, భవిష్యత్ కార్యాచరణపై దాదాపు 30 నిమిషాలు ఆయనతో దిల్లీలో చర్చించినట్లు మధుయాష్కీ తెలిపారు.
రాహుల్ గాంధీతో భేటీ అయిన మధు యాష్కీ - telangana congress latest news
ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీని ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీ శుక్రవారం దిల్లీలో కలిశారు. దాదాపు అరగంటపాటు రాష్ట్ర రాజకీయాలు సహా పలు అంశాలపై చర్చించినట్లు ఆయన వెల్లడించారు.
రాహుల్ గాంధీతో భేటీ అయిన మధు యాష్కీ
కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ, అన్ని సామాజిక వర్గాలు పార్టీలో ఉండేటట్లు ప్రణాళిక రూపకల్పన చేయాలని విజ్ఞప్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సామాజిక న్యాయం పాటించాలని కోరినట్లు వెల్లడించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు, తెలంగాణ మండలి ఎన్నికల గురించి.. తనను రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ఇవి కాకుండా అనేక అంశాలపై చర్చించనట్లు... అన్ని అంశాలపై రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించినట్లు వివరించారు.
ఇదీ చూడండి :ఇంధన ధరల పెరుగుదలపై నిరసనగళం విప్పాలి: ఉత్తమ్