హైదరాబాద్ మాదాపూర్‌లోని దుర్గంచెరువుపై 184 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న తీగల వంతెనను తెలంగాణ ప్రభుత్వం.... జులైలో నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. భాగ్యనగరంలో మరో మణిహారంగా భావించే తీగల వంతెన ప్రారంభోత్సవానికి శరవేగంగా ముస్తాబవుతోంది.
భాగ్యనగరం సిగలో మణిహారం ఈ వంతెన - durgam cheruvu cable bridge opening
భాగ్యనగరం చరిత్రలో మరో మణిహారంగా నిలిచే తీగల వంతెన ప్రారంభోత్సవానికి శరవేగంగా ముస్తాబవుతోంది. మాదాపూర్‌లోని దుర్గంచెరువుపై 184 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న తీగల వంతెనను జులైలో నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. తీగల వంతెన నిర్మాణంలో జరిగిన ఆసక్తికర పరిణామాలు, 8 దేశాల ఇంజినీర్లు అందించిన సాంకేతికతపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
చెరువు పరిసరాల్లోని పర్యావరణం దెబ్బతినకుండా ఇరువైపుల ఉన్న ఒడ్డుపై... కేవలం 2 పిల్లర్ల సహాయంతో 735 మీటర్ల పొడువులో ఎల్‌అండ్‌టీ సంస్థ తీగల వంతెనను నిర్మిస్తోంది. ఈ వంతెన అందుబాటులోకి వస్తే పంజాగుట్ట నుంచి నానక్ రాంగూడలోని బాహ్యావలయ రహదారికి అతి సులభంగా చేరుకోవచ్చు.
ఇన్నాళ్లు ట్రాఫిక్ రద్దీలో చిక్కుకుని వేలాది పనిగంటలు వృథా చేసుకున్న ఉద్యోగులు, ఇతరులకు ఈ తీగల వంతెన మార్గంలో వెళ్లడం ద్వారా అరగంటకుపైగానే సమయం కలిసొస్తుంది. అలాగే రవాణా సౌకర్యంగానే కాకుండా దుర్గంచెరువు పరిసరాలను పర్యటక ప్రాంతంగానూ ముస్తాబు చేస్తున్నారు.