Madhapur Rave Party Drugs Case Update :మాదాపూర్ డ్రగ్స్(Madhapur Drugs Case) కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. గత నెల ఆగస్టు 31న ముగ్గురిని అరెస్ చేసిన పోలీసులు.. తాజాగా మరో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు నైజీరియన్లతో పాటు.. మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న అయిదుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ఓ సినీ నిర్మాత ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
Hyderabad Drugs Case Update : మాదాపూర్ డ్రగ్స్ కేసులో 'వెంకట్ లీలలు'.. అమ్మాయిలకు సినీ ఎర.. రేవ్ పార్టీల్లో ప్రముఖులకు వల
పట్టుబడ్డ నిందితుల నుంచి 50 గ్రాముల ఎండీఎంఏ, 8 గ్రాముల కొకైన్, 24 ఎక్టసీపిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించనున్నారు. గత నెలలో నార్కోటిక్ విభాగం పోలీసులు గుడిమాల్కాపూర్, మాదాపూర్‌లో దాడి చేసి నిందితులైన.. బాలాజీ, సినీ ఫైనాన్షియర్ వెంకటరత్నారెడ్డి, మురళీలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
పట్టుబడ్డ నిందితులు 18 మందికి మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించి నిఘా పెట్టారు. ఈ క్రమంలో ముగ్గురు నైజీరియన్లు, అయిదుగురు వినియోగదారులు పట్టుబడ్డారు. బాలాజీ, వెంకటరత్నారెడ్డి, మురళీలను పోలీసులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. గత మూడు రోజులుగా వీళ్లను ప్రశ్నిస్తున్న పోలీసులు.. నిందితుల నుంచి సమాచారం సేకరించి మరికొంత మందిని అరెస్ట్ చేయనున్నారు.
Narcotics Bureau SP Sunitha Reddy Interview : 'మాదాపూర్ డ్రగ్స్ కేసు.. నిందితుల్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు'
Drugs Seized in LBnagar :నిషేధిత ఓపీఎమ్, పాపిస్ట్రాను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 25 లక్షల రూపాయల విలువ చేసే 7 కిలోల పాపిస్ట్రా, 70 గ్రాముల ఓపీఎమ్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన చెన్నారామ్ మూడేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు.
డబ్బుల కోసం ఓపీఎమ్తో పాటు.. పాపిస్ట్రా అనే మత్తు పదార్థాన్ని తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయించడం మొదలు పెట్టాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన పూర్ సింగ్ అనే వ్యక్తి నుంచి 50 వేలకు కిలో చొప్పున పాపిస్ట్రా పౌడర్‌ను కొనుగోలు చేసిన చెన్నారామ్.. హైదరాబాద్‌లో 4 లక్షలకు విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
కొల్లూరులో హార్డ్‌వేర్ దుకాణం నిర్వహిస్తున్న రాజస్థాన్ వాసి రాణారామ్.. ఓపీఎమ్ డ్రగ్స్‌కు అలవాటు పడి చెన్నారామ్ దగ్గర కొనుగోలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇతర వినియోగదారులను చెన్నారామ్ కు పరిచయం చేసి అతని వద్ద కమిషన్ తీసుకుంటున్నాడు. వనస్థలిపురంలో ఓపీఎమ్ విక్రయించేందుకు ప్రయత్నించిన చెన్నారామ్, రాణారామ్లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Hyderabad Sub Inspector Drugs Case Update : ఖాకీ వనంలో డ్రగ్స్.. ఆ ముగ్గురిపై కూడా పోలీసుల ఫోకస్
Drug Dealer Arrested At Hyderabad : పాపీ స్ట్రా డ్రగ్స్ సరఫరా.. స్కెచ్‌వేసి పట్టుకున్న ఎస్వోటీ పోలీసులు