మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.లక్ష్మణరావు తీర్పునిచ్చారు. మచిలీపట్నంకు చెందిన వైకాపా నాయకుడు మోకా భాస్కరరావు హత్య కేసులో ఏ4 నిందితునిగా రవీంద్ర ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ కొట్టివేత - కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ వార్తలు
ఏపీకి చెందిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు మచిలీపట్నంలోని జిల్లా కోర్టులో నిరాశ ఎదురైంది. ఆయన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ కొట్టివేత
రవీంద్ర తరఫు న్యాయవాదులు సిద్ధార్థ లూద్రా, పోసాని వెంకటేశ్వరరావులు బెయిల్ కోసం మచిలీపట్నంలోని జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రవీంద్ర తరఫు న్యాయవాదులు, ప్రాసిక్యూషన్ వాదనలు ఈ నెల 27న పూర్తయ్యాయి. అప్పుడు తీర్పును రిజర్వులో ఉంచిన న్యాయమూర్తి లక్ష్మణరావు... బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు గురువారం ప్రకటించారు.
ఇదీ చదవండి:నూతన పురపాలక చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి: కేటీఆర్