తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రేటర్​లో తెజసను గెలిపిస్తే ఎల్​ఆర్​ఎస్​ రద్దుచేస్తాం: కోదండరాం

గ్రేటర్​ హైదరాబాద్​ ఎన్నికలకు 27 మందితో తొలి జాబితా విడుదల చేశారు తెజస అధ్యక్షుడు కోదండరాం. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే.. ఎల్​ఆర్​ఎస్​ రద్దు సహా కాలుష్య రహిత నగరాన్ని నిర్మిస్తామన్నారు.

TJS
గ్రేటర్​లో తెజసను గెలిపిస్తే ఎల్​ఆర్​ఎస్​ రద్దుచేస్తాం: కోదండరాం

By

Published : Nov 19, 2020, 8:29 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికలకు తెలంగాణ జనసమితి 27 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. శుక్రవారం మరికొంత మందితో తుది జాబితాను వెల్లడిస్తామని పార్టీ అధ్యక్షుడు ఆచార్య కోదండరాం తెలిపారు.

పార్టీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసిన కోదండరాం నగర అభివృద్ధి కోసం నిస్వార్థంగా పనిచేసే వాళ్ల రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెజస తరఫున పోటీ చేయాలనుకునే వాళ్లు తమను సంప్రదించాలని కోరారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే ఎల్‌ఆర్‌ఎస్ రద్దు, లేఅవుట్‌ల అనుమతి కోసం సింగిల్‌ విండో వ్యవస్థ ఏర్పాటు, రక్షిత తాగునీరు సరఫరా, పారిశుద్ధ్యం, కాలుష్య రహిత నగరాన్ని నిర్మిస్తామన్నారు. ప్రొఫెసర్‌ విశ్వేశ్వర్‌రావు కన్వీనర్‌గా పదిమందితో ఎన్నికల కమిటీని కోదండరాం ప్రకటించారు.

ఇవీచూడండి:గ్రేటర్‌ ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల రెండో జాబితా విడుదల

ABOUT THE AUTHOR

...view details