తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ షురూ - ఎల్​ఆర్​ఎస్​

రాష్ట్రంలో ఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తుల పరిశీలనా ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 25 లక్షల 59 వేల దరఖాస్తులు వచ్చాయి. క్రమబద్ధీకరణ రుసుము వివరాలను ఆయా దరఖాస్తుదారులకు ఎస్సెమ్మెస్​ లేదా మెయిల్​ ద్వారా పంపుతామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్​ కుమార్​ పేర్కొన్నారు.

lrs verification process started
ప్రారంభమైన ఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తుల పరిశీలనా ప్రక్రియ

By

Published : Nov 16, 2020, 11:01 AM IST

రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. అనధికార, అనుమతులు లేని ప్లాట్లు, లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల 59 వేల దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చాయి. వీటిని లే అవుట్ల వారీగా గ్రూపులు, క్లస్టర్లుగా విభజించి పరిశీలించనున్నారు. వాటికి సంబంధించిన వివరాలను పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్​ కుమార్​ వెల్లడించారు.

క్లస్టర్లుగా విభజనతో ఒక లే అవుట్​కు అర్హత ఉంటే అందులోని ప్లాట్ల దరఖాస్తులన్నీ క్రమబద్ధీకరణకు అర్హత సాధిస్తాయని అర్వింద్​ కుమార్​ అన్నారు. క్రమబద్ధీకరణ రుసుము వివరాలను మొబైల్ నంబర్లకు ఎస్సెమ్మెస్ ద్వారా లేదా మెయిల్​కు పంపుతామని వివరించారు.

ఇదీ చదవండి:ఈనెల 23 నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్

ABOUT THE AUTHOR

...view details