రాష్ట్రంలో అనుమతుల్లేని, అనధికార ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో ఎల్ఆర్ఎస్ పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన కనబడుతోంది. పథకాన్ని ప్రారంభించిన రెండు రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 9 వేల 486 దరఖాస్తులు వచ్చాయి. మీసేవ కేంద్రాలు, ఇతర ప్రభుత్వ ఆన్లైన్ సర్వీసుల ద్వారా విరివిగా దరఖాస్తులు అందుతున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.
ఎల్ఆర్ఎస్ పథకానికి ఆదరణ.. 96 లక్షల వరకు ఆదాయం - ఎల్ఆర్ఎస్ ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం
ప్రభుత్వం ప్రకటించిన ఎల్ఆర్ఎస్ పథకానికి మంచి ఆదరణ లభిస్తోంది. రెండు రోజుల్లోనే భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఆన్లైన్లో మంగళవారం రాత్రి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 9 వేలకు పైగా దరఖాస్తులు చేరాయి. ఇందులో మున్సిపాలిటీల్లోనే అధికంగా 4 వేల సంఖ్యలో దరఖాస్తులు రాగా.. మొత్తం రూ. 96 లక్షల వరకు ఆదాయం ప్రభుత్వ ఖజనాకు చేరింది.
![ఎల్ఆర్ఎస్ పథకానికి ఆదరణ.. 96 లక్షల వరకు ఆదాయం ఎల్ఆర్ఎస్ పథకానికి ఆదరణ.. 96 లక్షల వరకు ఆదాయం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8731976-thumbnail-3x2-lrs.jpg)
ఎల్ఆర్ఎస్ పథకానికి ఆదరణ.. 96 లక్షల వరకు ఆదాయం
ఇప్పటివరకు అందిన దరఖాస్తుల ద్వారా అడ్వాన్స్ కింద రూ. 96 లక్షల మేరకు సంబంధిత ఖాతాల్లో జమ అయినట్లు అధికారులు వెల్లడించారు. గ్రామ పంచాయతీల నుంచి 2 వేల 946, మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి 2 వేల 316, మున్సిపాలిటీల నుంచి 4 వేల 224 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు.