రాష్ట్రంలో అనుమతి లేని ప్లాట్లు, అనధికార లేఅవుట్ క్రమబద్దీకరణకు చేపట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌కు అనూహ్య స్పందన వచ్చింది. శనివారం చివరి రోజు కావడం వల్ల ఒక్కరోజే అర్ధరాత్రి వరకు 30 వేల 717 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 25 లక్షల 59 వేల దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
24 గంటల్లో 30,717 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు - తెలంగాణలో ఎల్‌ఆర్‌ఎస్ లేటెస్ట్ న్యూస్
అనుమతి లేని ప్లాట్లు, లే అవుట్‌ల క్రమబద్ధీకరణకు చేపట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌కు మంచి స్పందన వచ్చింది. చివరి రోజైన శనవారం అర్ధరాత్రి వరకు 30,717 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 25 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు ప్రకటించారు.
24గంటల్లో 30,717 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు
గ్రామపంచాయతీల నుంచి 10 లక్షలకు పైగా... పురపాలకసంఘాల నుంచి 10 లక్షలకు పైగా... నగరపాలకసంస్థల నుంచి 4 లక్షల పైగా దరఖాస్తులు వచ్చాయని ప్రకటించింది. దరఖాస్తుల సమయం ముగియగా మరికొద్ది రోజుల్లో పరిశీలన ప్రారంభమయ్యే అవకాశం ఉంది.