అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. రాష్ట్రంలో ఎల్‌ఆర్‌ఎస్‌కు బుధవారం వరకు 9.44 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
10 లక్షలకు చేరువలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు - ఎల్ఆర్ఎస్ స్టటస్
రాష్ట్రంలో అక్రమ ప్లాట్లు, అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌కు భారీ స్పందన వస్తోంది. ఎల్‌ఆర్‌ఎస్‌కు బుధవారం వరకు 9 లక్షల 44 వేల దరఖాస్తులు వచ్చాయి.
రాష్ట్రంలో 10 లక్షలకు చేరువలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు
ఇందులో పురపాలక సంఘాల నుంచి 3 లక్షల 79 వేల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు, గ్రామపంచాయతీల నుంచి 3 లక్షల 76 వేల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు, నగర పాలకసంస్థల నుంచి లక్ష 89 వేల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు రుసుం కింద ప్రభుత్వ ఖజానాకు రూ. 96.21 కోట్ల ఆదాయం చేకురింది.
- ఇదీ చదవండిఃఎల్ఆర్ఎస్ అవసరమా.. చేయించుకోకపోతే ?