రాష్ట్రంలో ఇవాళ, రేపు ఒకటి రెండు ప్రదేశాలలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రెండు రోజుల పాటు ఒకటి రెండు ప్రదేశాలలో ఉదయం సమయంలో తేలికపాటి పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో రాగల రెండురోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు - Weather updates telangana
రాష్ట్రంలో రాగల రెండు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈశాన్య తూర్పు దిశ నుంచి గాలులు వీస్తున్నాయని వెల్లడించింది.
రాష్ట్రంలో రాగల రెండురోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు
రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి రెండు చోట్ల శీతల గాలుల పరిస్థితి నెలకొందన్నారు. ప్రధానంగా ఈశాన్య తూర్పు దిశ నుంచి గాలులు వీస్తున్నాయని సంచాలకులు వివరించారు.