ఉత్తర అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని ఏపీ అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఈనెల 11లోగా తీరం దాటే అవకాశముందని చెప్పింది.
దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం స్పష్టంచేసింది.