తెలంగాణ

telangana

ETV Bharat / state

"తక్కువ దరఖాస్తులు వచ్చిన మద్యం దుకాణాలకు లాటరీ తీయొద్దు" - telangana wines tender 2019 lottery open today

తక్కువ దరఖాస్తులు వచ్చిన  మద్యం దుకాణాలకు లాటరీ తియొద్దని ఎక్సైజ్ కమిషనర్ సోమేశ్ కుమార్  అధికారులను ఆదేశించారు. వాటిపై సమగ్ర విచారణ జరిపి రెండురోజుల్లో నివేదిక ఇవ్వాలని డిప్యూటీ కమిషనర్లను సోమేశ్​ కుమార్​ ఆదేశించారు.

do not open the lottery less application forms wine shops

By

Published : Oct 18, 2019, 10:27 AM IST

'తక్కువ దరఖాస్తులు వచ్చిన మద్యం దుకాణాల లాటరీ తియెుద్దు'
రాష్ట్రవ్యాప్తంగా మరి కొద్దిసేపట్లో మద్యం దుకాణాల లైసెన్స్ ఎంపిక ప్రక్రియను ఆయా జిల్లా కేంద్రాల్లో... జిల్లా పాలనాధికారులు ప్రారంభించనున్నారు. కానీ తక్కువ దరఖాస్తులు వచ్చిన మద్యం దుకాణాలకు లాటరీ తియొద్దని ఎక్సైజ్ కమిషనర్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మిగతా వాటి లాటరీ ప్రక్రియ యథావిధిగా కొనసాగనుంది.

రాష్ట్రవ్యాప్తంగా 20కి పైగా మద్యం దుకాణాలకు ఐదు అంతకంటే తక్కువ దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. మద్యం వ్యాపారులు సిండికేట్ అవడం వల్లే తక్కువ దరఖాస్తులు వచ్చినట్లు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి డివిజన్లలో 9 దుకాణాలకు తక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఘట్​కేసర్, బేగంపేట్, సికింద్రాబాద్, ముషీరాబాద్, దూల్ పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దరఖాస్తులు తగ్గాయి. తక్కువ దరఖాస్తులు వచ్చిన దుకాణాలకు సంబంధించి సమగ్ర విచారణ చేసి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని డిప్యూటీ కమిషనర్లను ఎక్సైజ్ కమిషనర్ సోమేశ్ కుమార్ ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details