తెలంగాణ

telangana

ETV Bharat / state

అమ్మా నాన్నా..ఓ 'ప్రేమ'

పుట్టిన ప్రతీ ఒక్కరూ ప్రేమిస్తారు. చిన్నప్పుడు కుటుంబ సభ్యులను.. వయసొచ్చాక ప్రియుడు లేదా ప్రియురాలిని. ఒక ప్రేమని గెలిపించుకునేందుకు మరో ప్రేమని వదిలేస్తున్నారు

By

Published : Feb 14, 2019, 1:03 PM IST

పిల్లల ప్రేమను ప్రేమగా స్వీకరించండి

పిల్లల ప్రేమను ప్రేమగా స్వీకరించండి
ప్రేమలో పడ్డవారికి ప్రేమ అనే మాట వింటేనే తీయగా అనిపిస్తుంది. అదే తల్లిదండ్రులకు కూతురు ఎవర్నో ప్రేమిస్తుందంటే చేదుగా వినిపిస్తుంటుంది. నిజమైన ప్రేమలో కేవలం తియ్యదనం మాత్రమే ఉంటుంది. అది అమ్మాయి ప్రేమైనా కావొచ్చు. అమ్మ ప్రేమైనా కావొచ్చు. అప్పుడే భూమిపై అడుగిడిన చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు ప్రేమ ఎన్నో అనుభూతుల్ని అందిస్తుంది.

జన్మనిచ్చిన తల్లి ఒడిలో బాబు... తనకు తెలియకుండానే అమ్మ ప్రేమను ఆస్వాదిస్తాడు. చిన్న పిల్లలు ఆకలినైనా తట్టుకోగలరేమోగాని అమ్మ ఒడి లేకపోతే మాత్రం తట్టుకోలేరు. అలాగే నిజంగా ప్రేమించుకున్న యువత కూడా ఒకరినొకరు వదిలి బతకలేరు. మనసులో పుట్టిన ప్రేమ మట్టిలో కలిసేంత వరకూ ఉంటుంది. అందుకే ఎంత మంది ఎదిరించినా తలొగ్గకుండా తమ ప్రేమని నిలుపుకోవాలని చూస్తుంటారు యువతీయువకులు. ప్రాణాలను కూడా లెక్కచేయకుండా తమ ప్రాణ సఖిని కావాలనుకుంటారు.

ప్రేమకు కులం, మతం ఉండదనే చిన్న విషయాన్ని పెద్దలు అర్థం చేసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. పిల్లలు ఎవర్నైనా ప్రేమిస్తున్నామంటే అర్థం చేసుకోండి. వారి ప్రేమ నిజమైనదనిపిస్తేనే పెళ్లి చేయండి. లేదంటే వారికర్థమయ్యేలా చెప్పండి. కానీ తొందరపాటుతో దూరం చేసి జీవితాలు నాశనం చేయకండి. పిల్లలు కూడా తమ ప్రేమను గెలిపించుకునేందుకు తల్లిదండ్రులను వదిలేయొద్దు. అందరికీ అర్థమయ్యేలా ఒప్పుకునే వరకు వేచి చూడాలే తప్పా.. తొందరపాటు నిర్ణయం పనికిరాదు.
కాస్త డిఫరెంట్​గా ట్రై చేయండి

లవ్ బిజినెస్

ప్రేమకు ఫిల్మ్ ఫీల్

ABOUT THE AUTHOR

...view details