మాములు రోజుల్లోనే రద్దీగా ఉండే పార్కులు... మరి 'లవర్స్ డే' ఏవిధంగా ఉంటాయే... ప్రేమికులతో ఎలా కిక్కిరిస్తాయే చెప్పనక్కర్లేదు. అలాంటి ప్రేమికుల రోజు నగరంలోని పార్కులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయంటే నమ్మలేము కదా...
ప్రేమికుల దినోత్సవం వేళ.. పార్కులన్నీ వెలవెల - Bajrang Dal, Vishwa Hindu Parishad
భాగ్యనగరంలో ఎప్పుడూ ప్రేమికులతో రద్దీగా ఉండే పార్కులు... ప్రేమికుల రోజు నిర్మానుష్యంగా మారాయి. నగరంలోని ఏ పార్కులని చూసిన ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
ప్రేమ జంటలు పార్కులలో కనపడితే పెళ్లిళ్లు చేస్తామని భజరంగ్ దళ్ హెచ్చరించింది. దీంతో నెక్లెస్ రోడ్ , సంజీవయ్య పార్క్, హిట్ స్ట్రీట్, లవ్ హైదరాబాద్ చిహ్నం ఎప్పుడు ప్రేమికులతో కళకళలాడే ఈ ప్రదేశాలు ఈ రోజు ఖాళీగా కనిపిస్తున్నాయి.. భాగ్యనగర ప్రేమికులపై భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ నాయకులు ప్రభావం భాగ్యనగర ప్రేమికులపై తీవ్రంగానే ఉన్నట్లు అనిపిస్తోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నగర పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
ఇదీ చూడండి:పాల ట్యాంకర్ను ఢీకొన్న కారు... నలుగురు మృతి