ఓ యువతి గొంతుకోసిన యువకుడు తానూ ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ దిల్సుఖ్నగర్ పరిధిలోని చైతన్యపురిలో జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన వెంకటేశ్, హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువతి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇవాళ ఉదయం వీరిద్దరు చైతన్యపురిలోని బృందావన్ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. మధ్యాహ్న సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహంలో వెంకటేశ్ యువతి గొంతు కోశాడు. తర్వాత తానూ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. హోటల్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు యువతిని కొత్తపేటలోని ఓమ్ని ఆస్పత్రికి, వెంకటేశ్‌ను ఉస్మానియా వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉందన్నారు. వీరిద్దరి మధ్య గత నాలుగు నెలలుగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని తెలిపారు. వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను ఆ యువతి చరవాణి నుంచి డిలీట్ చేయడం వల్ల వేరే వ్యక్తితో మాట్లాడుతుందనే అనుమానంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగి ఉండవచ్చని పోలీసులు తెలిపారు.
ప్రియురాలి గొంతు కోసి ప్రియుడి ఆత్మహత్యాయత్నం - chaitanyapur
దిల్సుఖ్నగర్ పరిధిలోని చైతన్యపురిలో దారుణం జరిగింది. ఓ యువతి గొంతు కోసిన యువకుడు తానూ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉంది.
ప్రియురాలి గొంతు కోసి ప్రియుడి ఆత్మహత్యాయత్నం