తెలంగాణ

telangana

ETV Bharat / state

48 గంటలు గడవాలి: వైద్యులు - yashoda hospital

ఉన్మాది చేతిలో గాయాలైన మధులిక మృత్యువుతో పోరాడుతోంది. అపస్మారక స్థితిలో ఉండడం వల్ల వైద్యులు శస్త్ర చికిత్స చేయడం కష్టంగా మారింది.

ప్రేమోన్మాది దాడి

By

Published : Feb 6, 2019, 4:58 PM IST

ఉన్మాది దాడిలో గాయపడిన యువతి పరిస్థితి
ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడి విద్యార్థిని మధులిక ఆరోగ్య పరిస్థితి మరో రెండు రోజులు గడిస్తే తప్ప చెప్పలేమని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఉదయం 10 గంటల సమయంలో తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చారని అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.

ఇవీ చదవండి: మధులికపై దాడికి ఇదే కారణం..!

శ్వాస తీసుకోవడం కష్టంగా ఉన్నందున.. కృత్రిమంగా అందిస్తున్నట్లు చెప్పారు. మధులిక శరీరంపై 15 చోట్ల కత్తి గాయాలున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఎలాంటి శస్త్ర చికిత్స నిర్వహించలేదన్న వైద్యులు.. న్యూరో ఆర్థో జనరల్​, ప్లాస్టిక్​ సర్జన్​ వైద్యుల బృందం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చదవండి: ప్రేమించలేదని నరికేశాడు..
తనను ప్రేమించలేదన్న కక్షతో హైదరాబాద్​ సత్యానగర్​కు చెందిన మధులికపై భరత్​ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన ఆమెను తల్లిదండ్రులు మలక్​పేట యశోద ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details