తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోలేక పోతున్నానని మనస్తాపం చెందిన ఓ బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫలక్‌నుమాకు చెందిన పదహారేళ్ళ బాలిక స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. గత కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. అతనితో పెళ్లి చేయాలని తల్లిదండ్రులను కోరింది. మైనర్ కావడం వల్ల మేజర్ అయ్యాక పెళ్లి చేస్తామని చెప్పారు. అయినప్పటికీ బాలిక వినకుండా ఈ నెల 20న మధ్యవర్తి ద్వారా పెళ్లి జరిపించాలని ఓ పెద్దమనిషిని సంప్రదించింది. అతను సైతం మైనర్ అని చెప్పి తిరస్కరించారు. దీంతో మనస్తాపం చెందిన బాలిక బుధవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనకు పాల్పడే ముందు బాలిక రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘"రెండేళ్ల తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో... తనకు నచ్చిన యువకునితో పెళ్లి అవుతుందో లేదో.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను.. సారీ డాడీ.. సారీ మమ్మీ’.." అంటూ లేఖలో రాసి ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రియుడితో పెళ్లి చేయడం లేదని ఆత్మహత్య - love suicide in falknuma
‘"రెండేళ్ల తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో... నచ్చిన యువకునితో పెళ్లి అవుతుందో లేదో.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను.. సారీ డాడీ.. సారీ మమ్మీ’.." ఆత్మహత్యకు పాల్పడే ముందు మైనర్ బాలిక రాసిన లేఖ. ఫలక్‌నూమా పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మేజర్ అయ్యేవరకు ఆగమన్నందుకు ఆత్మహత్య
TAGGED:
love suicide in falknuma