తెలంగాణ

telangana

ETV Bharat / state

Love Marriage: ఐదేళ్లుగా ప్రేమించుకుని ఒక్కటయ్యారు.. ఆ తర్వాత..! - Guntur district

ఇద్దరూ మేజర్లే. పెద్దలను కాదని పెళ్లి చేసుకున్నారు. అటు నుంచి నేరుగా పోలీసుల దగ్గరికి వెళ్లి రక్షణ కోరారు. ఇరువైపుల కుటుంబసభ్యులను పిలిచి సర్ధిచెప్పి పంపించారు. ఇక అంతా.. ఓకే అని పూజల్లో నిమగ్నమైన సమయంలో అబ్బాయి ఇంటిపై దాడి చేశారు అమ్మాయి తరఫు కుటుంబసభ్యులు.

love-marriage-relatives-of-the-young-woman-raided-the-young-mans-home
love-marriage-relatives-of-the-young-woman-raided-the-young-mans-home

By

Published : Aug 11, 2021, 8:22 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో కులాంతర ప్రేమ పెళ్లి వ్యవహారం వివాదానికి దారి తీసింది. ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై అమ్మాయి తరఫు బంధువులు దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.

షాహీనాకు తాళి కడుతున్న రవి

గణపవరం గ్రామానికి చెందిన పొలిశెట్టి రవి అనే యువకుడు.. గుంటూరుకు చెందిన మహ్మద్​ షాహీనా అనే యువతి ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇద్దరు మేజర్లు కావటంతో... వారం క్రితం పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత నాదెండ్ల పోలీస్ స్టేషన్​కు వెళ్ళి.. రక్షణ కల్పించాలని వేడుకున్నారు. పోలీసులు ఇరు కుటుంబాలను పిలిచి కౌన్సిలింగ్​ చేసి పంపించారు.

దండలు మార్చుకున్న షాహీనా, రవి
గుడిలో వివాహమాడిన రవి, షాహీనా

అంతా బాగానే ఉందని భావించిన రవి తరఫు కుటుంబసభ్యులు.. బుధవారం రోజున నోములు జరుపుకుంటుున్నారు. పూజ జరుగుతున్న సమయంలో షాహీనా బంధువులు రవి ఇంటికి వచ్చి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇంటి అద్దాలు పగిలిపోవడంతో పాటు.. ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని గొడవను అదుపు చేశారు.

ఇదీ చదవండి:అక్రమ కేసులు పెట్టేవారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details