తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆధార్ వ్యథలు... చలిలోనే రేషన్​దారుల అవస్థలు - తెలంగాణ వార్తలు

lot-of-people-wait-in-front-of-adhar-centers-in-districts
ఆధార్ వ్యథలు... చలిలోనే రేషన్​దారుల అవస్థలు

By

Published : Feb 3, 2021, 11:12 AM IST

Updated : Feb 3, 2021, 12:05 PM IST

11:09 February 03

ఆధార్ కేంద్రాల వద్ద బారులు తీరిన ప్రజలు

ఈనెల నుంచి ఓటీపీ ద్వారా రేషన్‌ పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం సామాన్యులను ఇక్కట్లపాలు చేస్తోంది. గ్రామాల్లో సుమారు 30 శాతం మందికి ఆధార్‌తో ఫోన్‌నెంబర్ అనుసంధానం లేదు. ఓటీపీ రావాలంటే ఫోన్‌నెంబర్, ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి. లేదంటే రేషన్‌ దక్కదనే ఆందోళనతో బ్యాంకులు, ఆధార్ కేంద్రాల వద్ద పేదలు క్యూ కడుతున్నారు. చలికి వణుకుతూ తెల్లవారుజాము నుంచే ఆధార్​ కేంద్రాల ముందు జనం బారులు తీరారు.

ఆదిలాబాద్‌లో ఆధార్ కేంద్రం వద్ద రేషన్​ లబ్ధిదారులు తెల్లవారుజాము నుంచే వేచి చూస్తున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో ఆధార్‌ కేంద్రం తెరవడం లేదని స్థానికులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు.  

ఇదీ చదవండి:లైవ్ వీడియో: వివాహితపై గొడ్డలితో దాడి.. రాహుల్​ చిక్కాడు!

Last Updated : Feb 3, 2021, 12:05 PM IST

ABOUT THE AUTHOR

...view details