తెలంగాణ

telangana

ETV Bharat / state

వెల్లువెత్తిన మద్యం దరఖాస్తులు.. రూ. 900 కోట్లకు పైగా ఆదాయం

రాష్ట్రంలో 2, 216 మద్యం దుకాణాలు దక్కించుకోడానికి చివరి రోజైన బుధవారం అర్ధరాత్రి వరకు 48,385 దరఖాస్తులు వెల్లువెత్తడం వల్ల మొత్తం రూ. 900 కోట్లకు పైగా రాబడి ప్రభుత్వానికి వచ్చింది. వరంగల్ డివిజన్​లో అత్యధికంగా 7,864 దరఖాస్తులు రాగా తర్వాతి స్థానాల్లో ఖమ్మం, రంగారెడ్డి, నల్గొండ ఉన్నాయి.

By

Published : Oct 17, 2019, 5:36 AM IST

Updated : Oct 17, 2019, 9:08 AM IST

వెల్లువెత్తిన మద్యం దరఖాస్తులు

వెల్లువెత్తిన మద్యం దరఖాస్తులు
తెలంగాణలో మద్యం దుకాణాలు దక్కించుకోడానికి వ్యాపారుల అధిక సంఖ్యలో పోటీ పడ్డారు. బుధవారం చివరి రోజు కావడం వల్ల... గడువు ముగిసే సమయానికి క్యూలైన్​లో ఉన్న వారందరి దరఖాస్తులను అర్ధరాత్రి వరకు స్వీకరించారు. రాష్ట్రంలోని 2, 216 మద్యం దుకాణాలు ఏర్పాటు చేసేందుకు ఈ నెల 9 నుంచి దరఖాస్తులను ఆబ్కారీ శాఖ ఆహ్వానించింది. మంగళవారం సాయంత్రం వరకు 20 వేల 937 దరఖాస్తులు రాగా, నిన్న అర్ధరాత్రి వరకు ఒక్కరోజె 24 వేల 448 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌ తెలిపారు. మొత్తం 48, 385 వచ్చినట్లు పేర్కొన్నారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 907.70 కోట్ల రాబడి సమకూరినట్లు ఆయన వివరించారు.

అత్యధికంగా వరంగల్​:

రాష్ట్రంలోని 34 ఎక్సైజ్‌ జిల్లాల పరిధిలోని 2, 216 మద్యం షాపులకు అర్ధరాత్రి వరకు వచ్చిన 48, 385 దరఖాస్తులను పది ఉమ్మడి జిల్లాల్లోని ఎక్సైజ్ డివిజన్ల వారీగా పరిశీలించినట్లయితే అత్యధికంగా వరంగల్‌ డివిజన్‌లో 7 వేల 864, ఖమ్మం 7 వేల 271, నల్గొండ 7 వేల 49, రంగారెడ్డి డివిజన్‌లో 7, 126 లెక్కన వచ్చినట్లు ఆబ్కారీ శాఖ లెక్కలు వెల్లడించింది. తక్కువ దరఖాస్తులు వచ్చిన డివిజన్లలో హైదరాబాద్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, మెదక్‌లు ఉన్నట్లు ఎక్సైజ్‌ శాఖ అధికారులు తెలిపారు. 2017లో 41 వేలకుపైగా దరఖాస్తులు వచ్చినందున లక్ష రుసుం కింద మొత్తం రూ.411 కోట్లు రాబడి వచ్చింది. అయితే ఈసారి దరఖాస్తు రుసుం రెండు లక్షలకు పెంచడం వల్ల ప్రభుత్వానికి రెట్టింపునకు మించి రాబడి వచ్చిందని అధికారులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్​ వ్యాపారుల పోటీ:

ఆంధ్రప్రదేశ్​లో మద్యం దుకాణాలను అక్కడి ప్రభుత్వమే నిర్వహిస్తోంది. అందువల్ల లిక్కర్​ వ్యాపారంలో ఉన్నవారు ప్రత్యేకించి తెలంగాణ సరిహద్దు జిల్లాలోని మద్యం షాపులను దక్కించుకోవడానికి తీవ్రంగా పోటీపడ్డారు.

ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష

Last Updated : Oct 17, 2019, 9:08 AM IST

ABOUT THE AUTHOR

...view details