యాదాద్రి జిల్లా సుంకేసులకు చెందిన ప్రముఖ ఎన్నారై పైళ్ల మల్లారెడ్డి.. ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి 116 రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి మంత్రి కేటీఆర్కు అందజేశారు.
ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ
కరోనాపై పోరుకు దాతలు ముందుకు వస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయనిధికి నిన్న పలువురు విరాళాలు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కులను ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్కు అందజేశారు.
ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ
విజ్ఞాన్ విద్యాలయం, వాసవీ రియల్టర్, ఎల్ఎల్పీ సంస్థల యాజమాన్యాలు 25 లక్షల చొప్పున చెక్కులను మంత్రి కేటీఆర్కు అందించారు. టెక్ సిస్టం గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ 10 లక్షలు, న్యూ కాన్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, ధనలక్ష్మి ట్రేడర్స్ ఐదు లక్షలు, ఎమరాల్డ్ మిఠాయి షాప్ మూడు లక్షల రూపాయల చొప్పున విరాళాలు ప్రకటించాయి.
ఇవీచూడండి:11 నెలల పసికందును చంపి.. తల్లి ఆత్మహత్య