కరోనా ప్రభావం లారీ యజమానులను తీవ్రంగా దెబ్బతీసింది. లాక్డౌన్ అమలుతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వర్తక, వాణిజ్య, వ్యాపార రంగాలు, పరిశ్రమలు మూతపడడం వల్ల లారీ చక్రాలు నిలిచిపోయాయి. చక్రం తిరిగితే తప్ప తమ బతుకు బండి నడవదని... ఇలాంటి విపత్కర పరిస్థితులలో ప్రభుత్వాలు లారీ యజమానుల గురించి ఆలోచించాలని కోరుతున్నారు.
ఈ పరిస్థితిలో అటు ఓనర్లతో పాటు డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా మంది లారీ రవాణాపై ఆధారపడినవారంతా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోవడం వల్ల కిస్తీలు ఎలా కట్టాలనే దిగులు యజమానులకు పట్టుకుంది. ప్రస్తుతానికి ఆర్బీఐ మూడు నెలల కిస్తులు ఆపి మారిటోరియమ్ పద్ధతిలో చెల్లిచేందుకు వెసులుబాటు కల్పించినప్పటికీ ఈ మూడు నెలలకు సంబంధించిన వడ్డీ... లేనిచో లాక్డౌన్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులకు సంబంధించి ఆయా లారీలపై వడ్డీలను ఎత్తివేయాలని యజమానులు కోరుతున్నారు.