తెలంగాణ

telangana

ETV Bharat / state

రైల్వే క్రాసింగ్ వద్ద నిలిచిన లారీ.. అదే సమయానికి వచ్చిన రైలు - రైల్వే క్రాసింగ్ సమస్యలు

Lorry Stuck at Railway Crossing: రైల్వే క్రాసింగ్​ దగ్గర రైలు పట్టాలపై లారీ, ఇంకోవైపు రైలు వస్తుంది. ఇలాంటి సన్నివేశం సినిమాలో చూసి ఉంటారు. అయితే నిజంగానే అలా జరిగింది. ఆంధ్రప్రదేశ్​లోని బాపట్ల జిల్లాలోని వేమూరు మండలం పెనుమర్రు స్టేషన్ సమీపంలో జరిగింది. లోకోపైలేట్​ అప్రమత్తంగా ఉండడంతో రైలుని ఆపివేశారు.

Lorry Stuck at Railway Crossing
రైల్వే క్రాసింగ్ వద్ద నిలిచిన లారీ

By

Published : Dec 24, 2022, 2:38 PM IST

Lorry Stuck at Railway Crossing: ఆంధ్రప్రదేశ్​లోని బాపట్ల జిల్లాలో రైల్వే క్రాసింగ్ వద్ద లారీ ఇరుక్కుపోవటతో ఒకింత ఆందోళన నెలకొంది. వేమూరు మండలం పెనుమర్రు స్టేషన్ సమీపంలో ఉన్న లెవల్ క్రాసింగ్ వద్ద లారీ సాంకేతిక సమస్యతో ఆగిపోయింది. అదే సమయానికి రేపల్లె నుంచి గుంటూరుకు వెళ్లే ప్యాసింజర్ రైలు వచ్చింది. రైలు డ్రైవర్ అప్రమత్తంగా ఉండి ముందుగానే రైలును ఆపివేశారు.

విషయాన్ని తెలుసుకున్న గ్రామస్థులు లారీని ట్రాక్టర్​కు కట్టి​ స్థానికుల సహకారంతో లారీని గేటు బయటకు లాగారు. ఫలితంగా రైలు వెళ్లడానికి మార్గం సుగమం అయింది. ఈ ఘటన వల్ల దాదాపు 40 నిమిషాల పాటు రైలు ఆగిపోయింది.

రైల్వే క్రాసింగ్ వద్ద నిలిచిన లారీ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details