తెలంగాణ

telangana

పెట్రోల్ ,డీజిల్ ధరలను తగ్గించాలని లారీ ఓనర్స్ ఆధ్వర్యంలో ధర్నా

By

Published : Apr 1, 2022, 6:29 PM IST

పెంచిన పెట్రోల్ ,డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని తెలంగాణ స్టేట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెరిగిన ఇంధన ధరలతో వాహనాలు నడపక లేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Protest
నిరసన

హైదరాబాద్ ఆటోనగర్​లో తెలంగాణ స్టేట్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని నిరసన వ్యక్తం చేశారు.

గతంలో ఎన్డీఏ ప్రభుత్వం 67 సార్లు చమురు ధరలను పెంచిన రూ. 67 రూపాయలు మాత్రమే ఉందన్నారు. ప్రస్తుతం రూ.114గా ఉంది. ఫలితంగా లారీ యజమానులు కిస్తీలు ,ట్యాక్సీలు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:టిమ్స్ ఆసుపత్రి ఎదుట కాంట్రాక్టు కార్మికులు ఆందోళన ఎందుకంటే..

ABOUT THE AUTHOR

...view details