హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ ఎన్ఎండీసీ సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పవిత్రోత్సవాలు చివరిరోజు ఘనంగా ముగిశాయి. గత మూడు రోజులుగా వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూర్ణాహుతి హోమాన్ని నిర్వహించారు. ఈరోజు పూర్ణాహుతి ముగిసిన తరువాత భక్తులకు పవిత్రాలను అందజేశారు. ఈ పవిత్రాలను అందుకోడానికి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. తమకు పూర్ణాయుష్షును కలిగజేయాలంటూ హోమఫలాన్ని స్వీకరించారు.
వెంకటేశ్వర దేవాలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు - పవిత్రోత్సవాలు
హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. పూర్ణాహుతి హోమం అనంతరం భక్తులు పవిత్రాలను అందుకున్నారు. ఈ పవిత్రాలు తమకు ఆయురారోగ్యాలు కలుగజేస్తాయనే నమ్మకంతో భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు.
హైదరాబాద్ వెంకటేశ్వర దేవాలయంలో ముగిన పవిత్రోత్సవాలు