తెలంగాణ

telangana

ETV Bharat / state

బదరీనారాయణి అవతారంలో దర్శనమిచ్చిన తిరుమలేశుడు - తిరుమల

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. తిరుమలలో ఏడోరోజు స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

surya-prabha-vahanam

By

Published : Oct 6, 2019, 1:48 PM IST


తిరుమలలో జరుగుతున్న ఏడుకొండలవాడి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏడోరోజున ఉదయం స్వామివారు బదరీనారాయణి అవతారంలో సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యప్రభ వాహనంలో ఉన్న స్వామివారిని దర్శించకుంటే సకల ఆయురారోగ్యాలు చేకూరతాయని భక్తులు నమ్మతుంటారు. భారీ సంఖ్యలో వస్తున్న భక్తికోటి జనవాహిని స్వామివారికి కర్పూర హారతులు, నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా తిరువీధుల్లో ఏర్పాటు చేసిన పలు కళాబృందాల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

surya-prabha-vahanam

ABOUT THE AUTHOR

...view details