తెలంగాణను చూశాక ఏపీ ప్రభుత్వం కూడా జిల్లాలు చేసే యోచనలో ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జిల్లాల విభజన తర్వాత పరిపాలన సులభతరం అయిందని తెలిపారు. గతంలో కంటే ఆ ప్రాంతాలు ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు.
'మన జిల్లాలను చూసి ఏపీలో కూడా చేస్తామన్నారు' - ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారం
తెలంగాణలో జిల్లాల విభజన తర్వాత ప్రజలు సంతోషంగా ఉన్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మన రాష్ట్రాన్ని చూసి ఏపీలో కూడా త్వరలో 25 జిల్లాలు చేయబోతున్నారని అన్నారు.
'మన జిల్లాలను చూసి పక్క రాష్ట్రంలో కూడా చేస్తామన్నారు'
నాకున్న సమాచారం ప్రకారం ఇప్పుడు ఏపీలో కూడా 25 జిల్లాలు చేస్తామన్నారని జగన్ తెలిపారని కేసీఆర్ పేర్కొన్నారు. ములుగు, భూపాలపల్లి లాంటి ప్రాంతాలు జిల్లాలు చేయడానికి పలు ప్రత్యేకతలు ఉన్నాయని కేసీఆర్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి :'నాకే బర్త్ సర్టిఫికెట్ లేదు... నన్నెవరని ప్రశ్నిస్తే నేనక్కడి నుంచి తీసుకురావాలె'