Loksatta on Health Situation in Telangana: గత 70 ఏళ్లుగా దేశాన్ని పాలించిన పాలకులు స్పష్టమైన వైద్య విధానాన్ని అనుసరించని కారణంగా పలు విపత్కర సమయాల్లో ప్రాణ నష్టం జరుగుతోందని లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో లోక్సత్తా పార్టీ 'అందరికీ ఆరోగ్యం-హక్కుగా వైద్య సేవలు' అంశంపై సదస్సు నిర్వహించింది. కరోనా మహమ్మారి ఈ నేపథ్యంలో వైద్య విధానాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి అవకాశం లభించిందని.. కానీ ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వివక్షతను నిర్మూలించాలి..
ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు, స్వేచ్ఛ మాత్రమే కాదన్న ఆయన.. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్ర విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులను పక్కనపెట్టి అనవసరమైన పనులు చేస్తున్నాయన్నారు. విద్యావ్యవస్థలో ఉన్న గ్రేడింగ్ మార్కులు, ర్యాంకులు పనికిరావన్న జేపీ.. ప్రతిభతో రాణించవచ్చన్నారు. ప్రస్తుతం సమాజంలో అనారోగ్యం, అకాల మరణం కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని పలు నివేదికలు కూడా వెల్లడించాయన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించి వివక్షతను నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు.
ఆరోగ్యశ్రీ అందరికీ వర్తింపజేయాలి..