తెలంగాణ

telangana

ETV Bharat / state

లోక్​సభ సభాపతి ఓంబిర్లా దృశ్యమాధ్యమ సమీక్ష - LOKSABHA SPEAKER OM BIRLA LATEST NEWS

కొవిడ్ 19పై రాష్ట్రాల్లో పరిస్థితులను సమీక్షించేందుకు లోక్​సభ సభాపతి ఓంబిర్లా దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.

OM BIRLA VIDEO CONFERENCE
లోక్​సభ సభాపతి ఓంబిర్లా దృశ్యమాధ్యమ సమీక్ష

By

Published : Apr 21, 2020, 7:33 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో రాష్ట్రాల్లో పరిస్థితులను సమీక్షించేందుకు లోక్​సభ సభాపతి ఓంబిర్లా నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో రాష్ట్రం నుంచి శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కొవిడ్ 19పై తెలంగాణ ప్రభుత్వం యుద్ధం చేస్తోందని తెలిపిన సభాపతులు... రాష్ట్రంలోని పరిస్థితులను వివరించారు.

శాసనసభ్యులు, మండలి సభ్యులు క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్యపరుస్తూ... సేవ చేస్తున్నారని తెలిపారు. పేదలు, వలస కూలీలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ తీసుకొందని వివరించారు. అయితే రాష్ట్రాల ఆదాయం తగ్గినందున ప్రధానమంత్రితో ప్రత్యేకంగా మాట్లాడి రాష్ట్రాలకు అదనపు నిధులను మంజూరు చేయించాలని సభాపతి ఓంబిర్లాను కోరారు.

ఇవీ చూడండి:'అలా బయటకు వచ్చేవారిపై... కేసులు పెడతాం'

ABOUT THE AUTHOR

...view details