లోక్‌సభ ఎన్నికలపై భాజపా కోర్ కమిటి సమావేశం - bjp mlc
రాబోయే లోక్‌సభ ఎన్నికలపై తెలంగాణ భాజపా దృష్టి సారించింది. మొత్తం స్థానాల్లో ఒంటరిగానే పోటీకి సిద్ధమవుతోంది.
bjp
లోక్‌సభ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి భాజపా పోటీ చేస్తుందని ఎమ్మెల్సీ రామచందర్‌రావు వెల్లడించారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని పేర్కొన్నారు. ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై పార్టీ కార్యాలయంలో కోర్ కమిటీ, పదాధికారుల సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.