LOKESH ON SWATHI MURDER: స్వాతి అనే యువతిని అత్యంత దారుణంగా చంపేస్తే.. కనిగిరి వైకాపా ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేయడం దారుణమని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన స్వాతిని అదనపుకట్నం కోసం వేధించి చంపిన భర్త శ్రీకాంత్, అత్తమామలను కఠినంగా శిక్షించాలని పోరాడుతున్న స్వాతి సోదరుడు వాసుకి అండగా ఉంటామని లోకేశ్ హామీ ఇచ్చారు. కేసు దర్యాప్తుని ఎమ్మెల్యే పక్కదారి పట్టించడం మానుకోవాలన్నారు. స్వాతికి లాగే ఎమ్మెల్యే కుమార్తెకి అన్యాయం జరిగితే ఇలాగే కేసుని నీరుగారుస్తారా అని ప్రశ్నించారు.
సాఫ్ట్‌వేర్ యువతి హత్య.. ఆత్మహత్యగా చిత్రీకరించడం దారుణం: లోకేశ్
LOKESH ON SWATHI MURDER: ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో ఓ సాఫ్ట్‌వేర్ యువతిని దారుణంగా హత్య చేసి.. దానిని ఆత్మహత్యగా చిత్రీకరించడాన్ని నారా లోకేశ్ తప్పుబట్టారు. అదనపుకట్నం కోసం వేధించి చంపిన భర్త, అత్తమామలను కఠినంగా శిక్షించాలని పోరాడుతున్న స్వాతి సోదరుడు వాసుకి అండగా ఉంటామని లోకేశ్ హామీ ఇచ్చారు.
సాఫ్ట్‌వేర్ యువతి హత్య.. ఆత్మహత్యగా చిత్రీకరించడం దారుణం:లోకేశ్