ఏపీలో మంత్రి పెద్దిరెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. తిరుపతిలోకి తన ముఠాలను తీసుకొచ్చి పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'తిరుపతి ఉపఎన్నికలో.. వైకాపా దొంగ ఓట్లతో గెలవాలనుకుంటోంది' - chittoor district latest news
తిరుపతి ఉప ఎన్నికలో బయటి వ్యక్తులతో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయిస్తున్నారని వైకాపాపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి.. మంత్రుల్ని అదుపులోకి తీసుకోవాలని కోరారు.

'తిరుపతి ఉపఎన్నికలో.. వైకాపా దొంగ ఓట్లతో గెలవాలనుకుంటుంది'
పెద్దిరెడ్డి మనుషులు దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నిస్తే తెదేపా శ్రేణులు అడ్డుకున్నారన్నారు. అక్రమ మార్గంలో ఎన్నికల్లో గెలవాలని మంత్రి రంగంలోకి దిగారని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించి పెద్దిరెడ్డి సహా మంత్రుల్ని అదుపులోకి తీసుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
- ఇదీ చదవండి :కీలక ఘట్టానికి సాగర్ పోరు..