తెలంగాణ

telangana

ETV Bharat / state

హోరెత్తుతున్న పుర పోరు.. విశాఖలో లోకేశ్ ఎన్నికల ప్రచారం - ap news

ఏపీలోని విశాఖలో తెలుగుదేశం ఎన్నికల ప్రచారంలో వేగం పెంచింది. ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌.. గాజువాకలో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్నారు. నగరానికి చేరుకున్న లోకేశ్‌కు.. పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. పరిపాలనా రాజధాని అని చెప్పి విశాఖలో కనీసం ఒక రోడ్డైనా వేశారా అని లోకేశ్‌ ప్రశ్నించారు.

హోరెత్తుతున్న పుర పోరు.. విశాఖలో లోకేశ్ ఎన్నికల ప్రచారం
హోరెత్తుతున్న పుర పోరు.. విశాఖలో లోకేశ్ ఎన్నికల ప్రచారం

By

Published : Mar 4, 2021, 1:03 PM IST

పరిపాలనా రాజధాని అని చెప్పి విశాఖలో కనీసం ఒక రోడ్డైనా వేశారా అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌.. ప్రభుత్వాన్ని నిలదీశారు. మహా నగరపాలక సంస్థ ఎన్నికల వేళ.. గాజువాకలో ప్రచారం ప్రారంభించిన లోకేశ్‌... ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.

తమ హయాంలో విశాఖకు తీసుకొచ్చిన మెడ్‌టెక్‌ పార్క్‌ లాంటి పరిశ్రమలు కరోనా సంక్షోభంలో జాతీయ స్థాయిలో ఖ్యాతి చాటాయన్నారు. జిల్లావ్యాప్తంగా 73వేల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. విశాఖ మేయర్‌ పీఠం తమదేనని స్పష్టం చేశారు.

హోరెత్తుతున్న పుర పోరు.. విశాఖలో లోకేశ్ ఎన్నికల ప్రచారం

ఇదీ చదవండి:570 స్థానాల్లో వైకాపా.. 5 చోట్ల తెదేపా ఏకగ్రీవం:ఏపీ ఎస్​ఈసీ

For All Latest Updates

TAGGED:

lokesh

ABOUT THE AUTHOR

...view details