తెలంగాణ

telangana

పాల ప్యాకెట్ల కంటే ముందే మద్యమా..?: లోకేశ్

By

Published : May 5, 2021, 9:26 AM IST

ఏపీ ప్రభుత్వంపై తెదేపా ముఖ్యనేత నారా లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ద‌శ‌ల‌వారీ మ‌ద్యనిషేధమని.. దశ‌ల‌వారీ అమ్మకం వేళ‌లు మార్చారని ధ్వజమెత్తారు. పాల ప్యాకెట్ల స‌మ‌యానికి ముందే మ‌ద్యం షాపులు తెరిస్తే ఏమనుకోవాలని ప్రశ్నించారు.

lokesh-criticize-jagan-over-wine-shops
పాల ప్యాకెట్ల కంటే ముందే మద్యమా..?: లోకేశ్

ఆంధ్రప్రదేశ్​లో ద‌శ‌ల‌వారీ మ‌ద్యనిషేధమన్న ముఖ్యమంత్రి జ‌గ‌న్‌రెడ్డి.. దశ‌ల‌వారీగా మ‌ద్యం అమ్మకం వేళ‌లు మార్చారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఉదయం పాల ప్యాకెట్లు అమ్మే స‌మ‌యానికి ముందే మ‌ద్యం షాపులు తెరిచి ఏం సందేశం ఇస్తున్నారని నిలదీశారు.

''క‌రోనా మందుల్లేక ప్రాణాలు పోతుంటే, తన సొంత బ్రాండ్ మందు ప్రెసిడెంట్ మోడ‌ల్‌ తాగమన్నట్టుంది మీ ఎవ్వారం'' అంటూ ఎద్దేవా చేశారు. బెడ్లు, ఆక్సిజన్, వ్యాక్సినేషన్ గాలికొదిలేసి లిక్కర్ షాపులు 6 గంటలకే తెరిచి ప్రజల్ని దోపిడీ చెయ్యడానికి ప్రభుత్వం పరితపించడం దారుణమని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండీ...నేటి నుంచే కర్ఫ్యూ అమలు.. వాటికి మాత్రమే మినహాయింపు

ABOUT THE AUTHOR

...view details