తెలంగాణ

telangana

ETV Bharat / state

Lokayuktha on Covid: "నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.. కఠిన చర్యలు తీసుకోండి"

Lokayuktha on covid: రాష్ట్రంలో కొవిడ్ విస్తరించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని లోకాయుక్త ఆదేశించింది. పోలీసు, జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్యశాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. యువత కరోనా నిబంధనలు పాటించకుండా తిరుగుతున్నారని లోకాయుక్తకు ఫిర్యాదు అందడంతో ఇలా స్పందించింది.

lokayuktha  on covid
కొవిడ్ విస్తరించకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్న లోకాయుక్త

By

Published : Dec 5, 2021, 9:38 PM IST

Lokayuktha on covid: రాష్ట్రంలో కరోనా విస్తరించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు, జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్యశాఖలను లోకాయుక్త ఆదేశించింది. యువత కొవిడ్ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా తిరిగేస్తున్నారని లోకాయుక్తకు ఫిర్యాదు రావడంతో ఆదేశాలు జారీ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన లోకాయుక్త పోలీసు, వైద్యారోగ్యశాఖ అధికారులకు సూచించింది. ఫిర్యాదుదారుడు పేర్కొన్న అంశాలను హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు సీపీ విజయకుమార్‌కు, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శికి వెల్లడించింది.

Lokayuktha on covid rules: ప్రధానంగా యువత టీ దుకాణాల వద్ద, షాపింగ్‌ మాల్స్, బేకరీలు, హోటళ్ల వద్ద కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా, హెల్మెట్లు వాడకుండా కొవిడ్‌ నియమ నిబంధనలకు పాతరేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ట్రాఫిక్‌ అదనపు సీపీ విజయకుమార్‌ ఈ విషయాన్ని రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమగ్రంగా చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇద్దరు కానిస్టేబుళ్లతో నిఘా పెంచండి

police on covid rules: ఇందుకోసం ప్రతి పోలీసు స్టేషన్‌ పరిధిలో ఇద్దరు కానిస్టేబుళ్లను ప్రత్యేకంగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర డీజీపీతో పాటు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనర్లను లోకాయుక్త ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.

ఇదీ చూడండి:

'లోకాయుక్తకు రావాల్సిన అవసరం లేదు'

సీఎంకు షాక్- ఆ కేసు మూసివేతపై కోర్టు గరం!

ABOUT THE AUTHOR

...view details