తెలంగాణ

telangana

ETV Bharat / state

బండి సంజయ్​ ఫిర్యాదుపై వారికి లోక్​సభ ప్రివిలేజ్​ కమిటీ నోటీసులు

బండి సంజయ్​ ఫిర్యాదుపై వారికి లోక్​సభ ప్రివిలేజ్​ కమిటీ నోటీసులు
బండి సంజయ్​ ఫిర్యాదుపై వారికి లోక్​సభ ప్రివిలేజ్​ కమిటీ నోటీసులు

By

Published : Jan 22, 2022, 10:36 AM IST

Updated : Jan 22, 2022, 11:12 AM IST

10:34 January 22

సీఎస్, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీచేసింది. బండి సంజయ్ ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ నోటీసులు పంపింది. ఫిబ్రవరి 3న తమ ముందు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. బండి సంజయ్ కేసులో వివరణ ఇవ్వాలని ప్రివిలేజ్ కమిటీ స్పష్టం చేసింది. డీజీపీ, కరీంనగర్ పోలీస్‌ కమిషనర్‌, ఏసీపీ, జగిత్యాల డీఎస్పీ, కరీంనగర్‌ ఇన్‌స్పెక్టర్‌కు లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది.

శుక్రవారం లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ ముందు బండి సంజయ్ తన వాంగ్మూలం ఇచ్చారు. కరీంనగర్‌లో జరిగిన ఘటన వివరాలు తెలిపారు. తన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును వివరించారు. తన క్యాంపు కార్యాలయంలో జాగరణ దీక్షకు దిగగా.. పోలీసులు తలుపులు పగలగొట్టి అరెస్ట్‌ చేశారని.. పార్లమెంట్‌ సభ్యుడిగా తన హక్కులకు భంగం కలిగించారని తెలిపారు. గ్యాస్‌ కట్టర్లు ఉపయోగించి తలుపులు బద్ధలు కొట్టారని ప్రివిలేజ్ కమిటీకి వివరించారు. ఈ ఘటనపై లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ సంబంధిత అధికారులకు నోటీసులు జారీచేసింది..

ఇదీ చదవండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 22, 2022, 11:12 AM IST

ABOUT THE AUTHOR

...view details