తెలంగాణ

telangana

Lockdown: పకడ్బందీగా లాక్‌డౌన్‌... రోడ్డెక్కితే వాహనాల జప్తు

By

Published : Jun 7, 2021, 5:02 AM IST

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్​డౌన్​ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అనవసరంగా రోడ్డెక్కె వాహనాలను పోలీసులు జప్తు చేస్తున్నారు.

Lockdown
రోడ్డెక్కితే వాహనాల జప్తు

హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ (Lockdown)ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. సికింద్రాబాద్‌, తార్నాక, బేగంపేట, అమీర్‌పేట్‌, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, మియాపూర్‌, ఖైరతాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌ తదితర ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన పోలీసు చెక్‌పోస్టు (Checkpost) వద్ద పోలీసులు వాహనాల రాకపోకలను పర్యవేక్షిస్తున్నారు.

రోడ్డెక్కుతున్న వాహనాలకు అనుమతి ఉందా? లేదా అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. అనుమతులు లేకుండా వాహనాలు రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేసి వాహనాలను జప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 4,620 కేసులు నమోదు చేశారు. 3,927 వాహనాలను జప్తు చేశారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి: Covaxin: పిల్లలపై క్లినికల్​ ట్రయల్స్​ షురూ

ABOUT THE AUTHOR

...view details