లాక్డౌన్ 3.0 నేపథ్యంలో ప్రభుత్వం పలు సడలింపులు ఇవ్వటం వల్ల ఇన్ని రోజులు తమని తాము ఇళ్లలో నిర్భంధిచుకున్న అనేక మంది విచ్చలవిడిగా రోడ్ల మీదకు వస్తున్నారు. రోడ్లపై వాహనాలు తిరగటం చూస్తే అసలు లాక్డౌన్ అమలులో ఉందా అనే అనుమానం రాకమానదు.
పేరుకే లాక్డౌన్.. అమలులో అంతా మామూలే.. - హైదరాబాద్ కూకట్పల్లి ట్రాఫిక్ పోలీసుల నిబంధనలు
లాక్డౌన్ అమలవుతున్నా కొన్ని ప్రాంతాలను చూస్తే... అసలు అక్కడ లాక్డౌన్ ఉందా అనే అనుమానం వచ్చేలా చేస్తున్నారు ప్రజలు. వీరికి తోడు పోలీసులు కూడా వీరిని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు.
పేరుకే లాక్డౌన్.. అమలులో అంతా మామూలే..
వాహనదారులు ఇంతగా రోడ్లపైకి వస్తున్నా హైదరాబాద్ కూకట్పల్లి ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం. గతంలో సీజ్ చేసిన వాహనాలను వెనక్కి తిరిగి ఇస్తామని చెప్పడం వల్ల వాహనదారులు పోలీస్ స్టేషన్ల వద్దకు చేరుకున్నారు. మాస్కులు ధరించి... భౌతిక దూరం పాటిస్తేనే వాహనాలను ఇస్తామని పోలీసులు చప్పినా వినకుండా ఒకే వద్ద గుమిగూడుతున్నారు.
ఇవీ చూడండి:ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో తెలంగాణ: కేటీఆర్
TAGGED:
vehicles seized in lockdown