రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పోలీసులు పక్కాగా అమలు చేస్తున్నారు. లాక్‌డౌన్ వేళల సడలింపులో హైదరాబాద్‌లో వాహనాల రాకపోకలు పెరిగాయి. సాధారణ రోజుల్లాగానే పలు కూడళ్ల వద్ద వాహనాలు బారులుతీరాయి. అమీర్‌పేట, కోఠి, బేగంబజార్, చింతల్‌బస్తీ, సికింద్రాబాద్, కూకట్‌పల్లిలో వాహనాల రద్దీ ఏర్పడింది. లాక్‌డౌన్ సడలింపు సమయాన్ని ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పొడిగించడంతో వాహనాల రాకపోకలు విపరీతంగా పెరిగాయి. వ్యాపారస్థులు తమ కార్యకలాపాలను ప్రారంభించారు. ఫలితంగా విక్రయాలు, కొనుగోళ్ల కోసం వచ్చే వాళ్లతో రహదారులు రద్దీగా కనిపించాయి.
ఎక్కడికక్కడ బారికేడ్లు..
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో లాక్‌డౌన్‌ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 తర్వాత బయటకు వచ్చిన వారిపై పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడిక్కడి బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. మహబూబాబాద్‌లో ఒంటిగంటకే వ్యాపార వాణిజ్య సముదాయాల మూతపడ్డాయి. జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పలు సెంటర్లు, చెక్ పోస్టులను సందర్శించి పరిస్థితిని పర్యవేక్షించారు.