లాక్‌డౌన్ నిబంధనలు పాటించని వారిపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిపై కేసులు నమోదు చేసి వాహనాలు జప్తు చేస్తున్నారు. శుక్రవారం.. హైదరాబాద్ కమిషనరేట్‌లో నిబంధనలు పాటించని వారిపై 9,552 కేసులు నమోదు చేశారు. 6,514 వాహనాలను సీజ్ చేశారు.
Lockdown: ఉల్లంఘిస్తే కేసులే.. ఈ పాస్‌లు ఉంటేనే అనుమతి - హైదరాబాద్ కమిషనరేట్‌లో లాక్‌డౌన్
హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో లాక్‌డౌన్ పటిష్ఠంగా కొనసాగుతోంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేస్తున్నారు.

హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో లాక్‌డౌన్
సైబరాబాద్ కమిషనరేట్‌లో నిబంధనలు అతిక్రమించిన 886 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ పాస్‌లు ఉన్న వారు మాత్రమే లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో రోడ్లపై రాకపోకలు కొనసాగించాలని.. మిగిలిన వారు రోడ్డెక్కితే చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరించారు.
ఇదీ చదవండి:Drinking Water Bill: కరోనా సమయంలో జలమండలి నుంచి భారీ మొత్తంలో