కేంద్రం ప్రతిపౌరుడికీ రూ.2 వేల ఫండ్ కేటాయించిందనే వార్తలో నిజమెంత? - lock down funds
ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి పౌరుడికీ రెండు వేల చొప్పున లాక్ డౌన్ ఫండ్ ప్రకటించిందంటూ... సామాజిక మధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వార్తలు సైబర్ నేరగాళ్ల పనేనని హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ ప్రసాద్ తెలిపారు. ఎవరూ... అలాంటి సందేశాలను నమ్మొద్దని సూచించారు.
![కేంద్రం ప్రతిపౌరుడికీ రూ.2 వేల ఫండ్ కేటాయించిందనే వార్తలో నిజమెంత? lock-fund-release-news-are-fake-said-cyber-crime-acp-prasad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7942513-293-7942513-1594208947401.jpg)
కేంద్రం ప్రతిపౌరుడికీ రూ.2 వేల ఫండ్ కేటాయించిందనే వార్తలో నిజమెంత?
దేశంలోని ప్రతి పౌరుడికీ కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ఫండ్ మంజూరు చేసిందంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని హైదరాబాద్ సైబర్‌క్రైం ఏసీపీ ప్రసాద్ సూచించారు. ఆ వార్త ప్రభుత్వం విడుదల చేసింది కాదని... సైబర్ కేటుగాళ్ల పన్నాగమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పేరిట, మూడు సింహాల నకిలీ రాజముద్రతో ఉన్న ఆ ప్రకటనపై సైబర్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.